భీకర ఎదురు కాల్పులు.. నలుగురు జవాన్లు వీరమరణం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
By సుభాష్Published on : 8 Nov 2020 5:53 PM IST

జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాదులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన భద్రతా బలగాలు వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టారు.
దీంతో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడగా, బలగాలు అప్రమత్తమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారితో పాటు ముగ్గురు జవాన్లు మరణించారు. అలాగే జవాన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులను హతమార్చినట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేష్ తెలిపారు. కాగా, ఓల్‌ఓసీ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.
Also Read
దీపావళి తర్వాతే పాఠశాలలుNext Story