దీపావళి తర్వాతే పాఠశాలలు

By సుభాష్  Published on  8 Nov 2020 11:58 AM GMT
దీపావళి తర్వాతే పాఠశాలలు

మహారాష్ట్ర: కరోనా మహమ్మారి కారణంగా అన్ని సంస్థలతో పాటు విద్యాసంస్థలు సైతం మూతపడ్డాయి. అన్‌లాక్‌లో భాగంగా పలు సంస్థలు తెరుచుకున్నా.. విద్యాసంస్థలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. కోవిడ్‌తో మార్చి నుంచి మూతబడిన దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు త్వరలో తిరిగి తెరుచుకుంటాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. కోవిడ్‌ వ్యాప్తిని తగ్గించేందుకు కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ దీపావళీ తర్వాత పాఠశాలలు (9 నుంచి12 తరగతులు) తిరిగి ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు. సీఎం ఉద్దవ్‌ ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

నవంబర్‌ 17 నుంచి 22 మధ్య రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆర్ఈపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తామని, పాఠశాలలను ఈ నెల 23 నుంచి తెరుస్తామని అన్నారు. విద్యార్థులులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఒక్కో బెంచికి ఒక్క విద్యార్థిని మాత్రమే కూర్చోనిస్తామని అన్నారు. తరగతులను రోజు విడిచి రోజు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే వీటిని తెరుస్తామన్నారు.

Next Story
Share it