భారీ ఎన్‌కౌంటర్.. 9 మది ఉగ్రవాదులు హతం
By సుభాష్ Published on 8 Jun 2020 11:19 AM ISTజమ్మూలో కాల్పులతో దద్దరిల్లిపోయింది. అడవి తల్లి ఒడిలో భారత బలగాలు ఉగ్రవాదులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాల్పుల మోతతో ఉగ్రవాదుల రక్తం ఏరులై పారింది. భారత బలగాలు ఉగ్రవాదులకు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా తీరు మారడం లేదు. భారత జవాన్ల తుటాల వర్షంకు 9 మంది ఉగ్రమూకలు బలయ్యారు.
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు - భద్రతా బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఆదివారం నుంచి సోమవారం వరకూ భీకరమైన కాల్పులు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం కాగా, సోమవారం (నేడు) జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం హతమైన ఉగ్రవాదుల సంఖ్య 9కి చేరింది. షోపియాన్ జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో వారి కాల్పులను భారత జవాన్లు తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు, ఆర్మీ అధికారులతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు. (ఇది చదవండి: ఇక కరోనా సోకితే ఇలా చేయండి.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు)
ఇంకా ఉగ్రవాదుల కోసం బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో షోపియాన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు సైతం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాదులు పింజోరాకు దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెబల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. మృతుల్లో ఓ హిజ్బుల్ కమాండర్ కూడా ఉన్నారు. ఆదివారం దాదాపు 15 గంటల పాటు కాల్పులు జరుగగా, సోమవారం ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత బలగాలు. (ఇది చదవండి: ఢిల్లీ: సగ ధరకే మద్యం.. భారీగా మద్యం ధరలు తగ్గించిన ప్రభుత్వం)