ఆ రికార్డు సాధించిన ఏకైన ఫాస్ట్ బౌలర్.. కోహ్లీ ఆకాశానికి ఎత్తేశాడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2020 12:42 PM ISTటెస్టుల్లో 600 వికెట్ల మైలు రాయిని చేరుకోవడం అంటే గొప్ప ఘనత. ఆ రికార్డును జేమ్స్ ఆండర్సన్ అందుకున్నాడు. పాకిస్థాన్ తో సౌతాంఫ్టన్ లో ముగిసిన మూడో టెస్టులో ఆ జట్టు కెప్టెన్ అజర్ అలీ వికెట్ తీసిన జేమ్స్ ఆండర్సన్ 600 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో అయిదు వికెట్లు తీసిన ఆండర్సన్.. సెకండ్ ఇన్నింగ్స్ లో అబిద్ అలీ, అజర్ అలీల వికెట్లు తీసి 600 వికెట్లు సాధించాడు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లేల తర్వాత 600 వికెట్ల మార్కును అందుకున్న బౌలర్ గా ఆండర్సన్ నిలిచాడు.
2003 సంవత్సరంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆండర్సన్ టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. 2018 లో మొహమ్మద్ షమీని అవుట్ చేసి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా గ్లెన్ మెగ్రాత్ 563 టెస్టు వికెట్ల రికార్డును అధిగమించాడు. ఇక ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మొదటి టెస్టులో ఆండర్సన్ ప్రదర్శన అంత బాగుండకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.. అయితే ఆండర్సన్ వాటిని కొట్టిపారేశాడు. మూడో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి 600 వికెట్ల మైలు రాయిని అందుకుని గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.
Congratulations @jimmy9 for this outstanding achievement of 600 wickets. Definitely one of the best bowlers I've faced.
— Virat Kohli (@imVkohli) August 25, 2020
జేమ్స్ ఆండర్సన్ సాధించిన ఘనతపై పలువురు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షాన్ని కురిపించారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ జేమ్స్ ఆండర్సన్ తాను ఎదుర్కొన్న గొప్ప బౌలర్లలో ఒకడని ప్రశంసించాడు. '600 వికెట్లు సాధించిన జేమ్స్ ఆండర్సన్ కు శుభాకాంక్షలు.. నేను ఎదుర్కొన్న గొప్ప బౌలర్లలో నువ్వు కూడా ఒకడివి' అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. 600 వికెట్ల క్లబ్ లో ఉన్న షేన్ వార్న్, అనిల్ కుంబ్లే కూడా ఆండర్సన్ సాధించిన ఘనతపై ప్రశంసలు కురిపించారు.
Congrats on the 600th Jimmy - Aweosme effort buddy 👍 pic.twitter.com/VWflgISbKv
— Shane Warne (@ShaneWarne) August 25, 2020
"Congrats on the 600th Jimmy - Aweosme effort buddy," అంటూ షేన్ వార్న్ ట్వీట్ చేశాడు.
Congratulations @jimmy9 on your 600 wickets! Massive effort from a great fast bowler. Welcome to the club 👍🏼
— Anil Kumble (@anilkumble1074) August 25, 2020
"Congratulations @jimmy9 on your 600 wickets! Massive effort from a great fast bowler. Welcome to the club," అంటూ కుంబ్లే ట్వీట్ చేశాడు.