చిత్తూరు : జిల్లా కేంద్రంలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాలలో విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహిస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివ‌రాళ్లోకెళితే.. గుడిపల్లి మండలం కనుమనపల్లిలో ఏర్పాటు చేసిన జల్లికట్టులో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు రూ. 15 వందల రూపాయలు వసూలు చేస్తున్నారు.

అయితే.. గత ప్రభుత్వంలో జల్లికట్టు నిర్వహకులపై కేసులు నమోదు చెయ్యడం జరిగింది. దీంతో గ్రామాల్లో జల్లికట్టు నిర్వహించడానికి బయపడేవారు. అయితే.. ప్రస్తుతం ఎటువంటి అనుమతులు లేకున్నా నాయకుల అండతో జ‌ల్లిక‌ట్టు నిర్వహిస్తున్నారు.

జిల్లా ఎస్పీ రాజ‌శేఖ‌ర బాబు జల్లి కట్టుపై నిఘా ఉంచాలని కోరుతున్నా.. కుప్పం నియోజకవర్గం పోలీసులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నారని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ్. జల్లిక‌ట్టు పోటీలలో పాల్గొనేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుండి పశువులను తీసుకు వస్తున్నారు. గ‌తంలో జల్లికట్టు కార‌ణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా.. చాలామంది గాయాల పాల‌వ‌డం విశేషం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.