టీమిండియా వరుస విజయాలు సాధించడం వెనుక ఫీల్డింగ్‌ కూడా ముఖ్య పాత్ర‌ పోషిస్తుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు ఎంతో పటిష్టంగా ఉన్నా.. ఫీల్డింగ్‌ను కూడా త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్ జ‌ట్టు ఫీల్డింగ్‌ విభాగాన్ని ఎంతో పటిష్టం చేశాడ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఆ కార‌ణంతోనే ఇటీవల శ్రీధర్‌ నియమాకాన్ని పొడిగిస్తూ మరోసారి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

Image result for jadeja fielding"

అయితే.. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్ ఎవరు.? అన్న విష‌య‌మై శ్రీధర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మ‌ట్ల‌లో రవీంద్ర జడేజానే బెస్ట్‌ ఫీల్డర్‌ అంటూ కితాబిచ్చాడు. ద‌శాబ్ద కాలంగా టీమిండియా ఫీల్డింగ్‌ విభాగాన్ని చూస్తే జడ్డూనే టాప్‌లో నిలుస్తాడన్నాడని వెల్ల‌డించాడు. జ‌ట్టులో అవకాశాల్ని జడేజా చక్కగా అందిపుచ‍్చుకున్నాడని.. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గానే కాకుండా ఫీల్డర్‌గా కూడా తనదైన ముద్ర వేశాడని.. పదేళ్ల కాలంలో జడ్డూనే బెస్ట్‌ ఫీల్డర్ అని ఆర్‌. శ్రీధర్ అన్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.