పెళ్లి సంబంధాల పోర్టల్‌.. ఐటీబీపీ బలగాల కోసం మాత్రమే.. !

By అంజి  Published on  16 Dec 2019 6:49 AM GMT
పెళ్లి సంబంధాల పోర్టల్‌.. ఐటీబీపీ బలగాల కోసం మాత్రమే.. !

ఢిల్లీ: పారామిలటరీ, ఐటీబీపీ బలగాల సంక్షేమం కోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు. బలగాల కోసం పెళ్లి సంబంధాల పోర్టల్‌ ఐటీబీపీ ప్రారంభించింది. ఐటీబీపీ సిబ్బందిలో పెళ్లికానివారు, విడాకులు తీసుకున్నవారు, విడిపోయిన జంటలు, బ్రహ్మచారులకు సోల్‌మెట్‌ను వెతకడంలో సహాయపడటానికి ఈ మ్యాట్రిమోనియల్‌ పోర్టల్‌ను ఐటీబీపీకి చెందిన ఐటీ విభాగం అభివృద్ధి చేసింది. ఐటీబీపీలో పనిచేసే స్త్రీ, పురుషులకు అందులోనే సంబంధాలు చూడడం ఈ పోర్టల్‌ ప్రత్యేకత. ప్రస్తుతం ఐటీబీపీలో 25,000 మంది పెళ్లికాని పురుషులు, 1,000 మంది మహిళలు వివిధ ర్యాంకుల్లో ఉన్నారు. యాక్సెస్‌ చేసిన డేటా ప్రకారం ఐటీబీపీ బలగాల్లో 333 మంది జంటలు ఉన్నాయి. వీరిలో చాలా మంది సిబ్బందిని మారుమూల సరిహద్దు ప్రదేశాలలో, సుదూర ప్రాంతాలలో నియమించారు.

ప్రభుత్వ నియమాకాలు ఒకే స్థలంలో ఒక జంటకు ప్రిఫరెన్షియల్ పోస్టింగ్‌ను అనుమతించడంతో సంస్థలోని అనేక మంది సిబ్బంది జీవిత భాగస్వామిని ఇష్టపడతారని ఐటీబీపీ అధికారి ఒకరు తెలిపారు. దేశం కోసం కలిసి పనిచేయడం భార్య భర్తలకు ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఐటీబీపీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎస్‌ దేశ్‌వాల్‌ పెళ్లి సంబంధాల పోర్టల్‌ను రూపొందించాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాన్ని ఆదేశించారు. కాగా ఈ నెల 9వ తేదీ నుంచి పోర్టల్‌ ప్రారంభమైంది. పోర్టల్‌లో ఇప్పటికే 150 మంది ఉద్యోగులు తమకు సోల్‌మేట్‌ కావాలని పేర్లు నమోదు చేసుకున్నారు.

Next Story