బెంగళూరు: మిషన్‌ 2020ని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ప్రకటించారు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని కె.శివన్‌ పేర్కొన్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలో ల్యాండర్‌, రోవర్‌ మాత్రమే ఉంటాయని తెలిపారు. కాగా 2019 సంవత్సరంలో ప్రయోగించిన చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌ బాగానే పని చేస్తోందని శివన్‌ సృష్టం చేశారు. అందుకే ఆర్బిటర్‌ ప్రయోగించడం లేదన్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో రెండో అంతరిక్ష ప్రయోగం కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందన్నారు. ఈ ఏడాది గగన్‌యాన్‌ ప్రాజెక్టును కూడా చేపడుతున్నామని శివన్‌ చెప్పారు. గగన్‌యాన్‌కు నలుగురు వ్యోమగాముల ఎంపిక పూర్తి అయిందని, ఈ నెల మూడో వారంలో రష్యాలో వ్యోమగాములు శిక్షణ తీసుకుంటారని తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.