ప్రపంచం ఆకలి కేకలతో మారుమ్రోగనుందా..?

By అంజి  Published on  3 April 2020 1:43 PM GMT
ప్రపంచం ఆకలి కేకలతో మారుమ్రోగనుందా..?

తినడానికి తిండి దొరక్క ప్రపంచం అల్లాడిపోనుందా.. కరోనా మహమ్మారి దెబ్బతో ఆహార ఎమర్జెన్సీ ప్రపంచాన్ని కమ్ముకోనుందా.. భవిష్యత్తు అలాగే ఉండబోతోంది అంటున్నాయి అంతర్జాతీయ సంస్థలు. వైరస్‌ను అడ్డుకోడానికి పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థలు రానున్న సంక్షోభంపై ప్రమాద ఘంటికలు మోగించాయి.

25 శాతం దేశాలలో ఇప్పటికే 20కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడీ కరోనా దెబ్బకి ఆహార భద్రత ప్రమాదంలో పడుతోంది. అభివృద్ధి చెందిన అమెరికాతో సహా పలు దేశాల్లోని అల్పాదాయ వర్గాల ప్రజలు, వృద్ధులకు ఆహారం అందించలేని స్థితికి చేరుకుంటోంది. దీనికి ఉత్పత్తి తగ్గిపోవడం ఒక కారణం అయితే కరోనా నేపథ్యంలో లాభాల కోసం వ్యాపార వర్గాలు సృష్టించే కృత్రిమ కొరత ఇంకొక కారణం. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఆహారం కోసం అమెరికాలో సైతం క్యూలు కడుతున్నారు. ఇక మరి కొన్ని ప్రాంతాలలో ఆహార పదార్ధాల కొనుగోలు కోసం బారులు తీరిన వాహనాలు కన్పిస్తుండగా, అక్కడ కూడా ఇండియన్ గ్రాసరి స్టోర్ లను మూసేస్తున్న నేపథ్యంలోఅనేకమంది ఆహార కొనుగోళ్ల కోసం మైళ్ల దూరం వెళ్తున్నారు. ఇదే సమయంలో లాక్‌డౌన్‌లతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో వున్నారు.

Is the world going to be hungry?

ఆహార పదార్థాల సరఫరాపై ఉన్న ఆందోళనల వల్ల ఇప్పటికే అన్ని సూపర్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.అయితే వాస్తవానికి దేశంలో ఏ ప్రాంతంలోనూ ఆహార కొరత లేదని, వేర్‌హౌస్‌లు, ప్రభుత్వ గోడౌన్లలో ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయని, ప్రజలు భయాందోళనలతో ఆహారోత్పత్తుల కోసం స్థానిక సోర్స్‌లకు పరుగులు తీస్తున్నారని, అందువల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని మరికొంతమంది చెబుతున్నారు.

Also Read: మీ ఫోన్‌ను శుభ్రం చేసుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..

Is the world going to be hungry?

ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సరైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Next Story