సుమంత్ స‌క్సెస్ కోసం అలా చేస్తున్నాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 8:17 AM GMT
సుమంత్ స‌క్సెస్ కోసం అలా చేస్తున్నాడా..?

వైవిధ్య‌మైన క‌థాంశాలతో సినిమాలు హీరోగా త‌న‌కంటూ ఇమేజ్‌ను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు సుమంత్‌. ఈయ‌న హీరోగా న‌టిస్తున్న త‌దుపరి చిత్రం ఖ‌రారైంది. క‌న్న‌డ చిత్రం 'కావ‌లూడారి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. క‌న్న‌డలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేయ‌బోతున్నారు. క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.జి.ధ‌నంజ‌య‌న్ ఈ చిత్రాన్ని రెండు భాష‌ల్లో నిర్మిస్తున్నారు. సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండగా… త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టుల‌తో ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు.

విజ‌య్ ఆంటోనితో భేతాళుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో విజ‌య‌వంత‌మైన 'క్ష‌ణం' చిత్రాన్ని తమిళంలో స‌త్యరాజ్ త‌న‌యుడు శిబిరాజ్‌తో స‌త్య అనే పేరుతో తెర‌కెక్కించి త‌మిళంలోనూ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి. శుక్ర‌వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను చెన్నైలో స్టార్ట్ చేశారు. చెన్నై, హైద‌రాబాద్ ప్రాంతాల్లో జ‌న‌వ‌రిలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. మార్చి నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Next Story