నిజమెంత: ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లాక్ డౌన్ ప్రోటోకాల్ భారత్ అమలు చేస్తోందా..?
By అంజి
కోవిద్-19 మహమ్మారి ప్రబలుతూ ఉండడంతో ప్రపంచం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంది. భారత ప్రభుత్వం కూడా పగడ్బంధీగా లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. మొత్తం 21 రోజుల పాటూ లాక్ డౌన్ ను విధిస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల కిందట తెలిపారు. దీంతో ప్రజా జీవనం స్తంభించిపోయింది.
రోజులు గడుస్తున్న కొద్దీ లాక్ డౌన్ ను ఎత్తి వేస్తారా లేదా అంటూ ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కొందరేమో లాక్ డౌన్ ను తీసేయొచ్చు అని చెబుతూ ఉంటే.. మరికొందరేమో ఈ మధ్యనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి కదా.. మరిన్ని రోజులు పొడిగిస్తారేమోనని అనుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రజలంతా బాగుండాలనే ముఖ్య ఉద్దేశ్యంతోనే లాక్ డౌన్ ను అమలు చేస్తోంది ప్రభుత్వం. లాక్ డౌన్ ను అమలు చేయని దేశాలు ఎలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నాయో చూడొచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్ అంటూ అందరూ విపరీతంగా షేర్ చేస్తూ ఉన్నారు.
ఆ మెసేజ్‌ల్లో ఏముందంటే
STEP 1 – 1 DAY.
STEP 2- 21 DAYS.
AFTER 5 DAYS.
STEP 3- 28 DAYS.
AFTER 5 DAYS.
STEP 4 – 15 DAYS.
And the same way, our government has followed its lockdown procedure till now.
స్టెప్ 1 - 1 రోజు
స్టెప్ 2- 21 రోజులు
అయిదు రోజుల తర్వాత
స్టెప్ 3- 28 రోజులు
మళ్లీ అయిదు రోజుల తర్వాత
స్టెప్ 4- 15 రోజులు
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్ ప్రకారం భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను ఇప్పటిదాకా అమలు చేస్తోంది. అన్నది ఆ మెసేజీ సారాంశం.
లాక్ డౌన్ కారణంగా కోవిద్-19 కేసులు సున్నా అయిపోతే.. లాక్ డౌన్ ను ఎత్తివేస్తారని.. కోవిద్ కేసుల సంఖ్య తగ్గకపోతే 28 రోజుల పాటూ మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తారట. అదీ కాకుంటే 5 రోజుల తర్వాత ఇంకో 15 రోజుల పాటూ పొడిగించే అవకాశం ఉందట. ఈ మెసేజీ ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లలో వైరల్ అవుతోంది. చాలా మంది ప్రభుత్వం ఇలాగే ఆచరించే అవకాశం ఉందని నమ్మేస్తూ ఉన్నారు.
https://newsmeter.in/fact-check-has-who-released-a-covid-19-lockdown-protocol/
నిజమెంత:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజీ పచ్చి అబద్ధం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకూ ఎటువంటి లాక్ డౌన్ ప్రోటోకాల్ ను అమలు చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అఫీషియల్ వెబ్ సైట్ లో కూడా ఎటువంటి ప్రోటోకాల్ కు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచలేదు. కేవలం కరోనాకు సంబంధించిన సమాచారం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ అఫీషియల్ వెబ్సైట్ లో చూడొచ్చు. అంతేకానీ ఎటువంటి లాక్ డౌన్ ప్రోటోకాల్ ను పొందుపరచలేదు.
భారత ప్రభుత్వం కూడా ఈ లాక్ డౌన్ వదంతులను ఖండించింది. ఏప్రిల్ 14, 2020 న లాక్ డౌన్ ముగియనున్న కారణంగా కామన్ ఎగ్జిట్ ప్లాన్ ఏమిటో తెలపాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన చర్చిస్తూ ఉన్నాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లుగా లాక్ డౌన్ ప్రోటోకాల్ ను భారత్ అమలు చేస్తోందన్నది 'పచ్చి అబద్ధం'