ఆమీర్ ఖాన్ కుమార్తెకు కూడా అదే సమస్య..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 1:53 PM GMT
ఆమీర్ ఖాన్ కుమార్తెకు కూడా అదే సమస్య..!

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ప్రపంచ మానసిక దినోత్సవం (అక్టోబర్ 10) సందర్భంగా తన మానసిక స్థితి గురించి ఎవరికీ తెలియని విషయాన్ని వెల్లడించింది. నాలుగేళ్లుగా డిప్రెషన్‌లో ఉన్నానని, డాక్టర్‌ దగ్గర ట్రీట్‌మెంట్‌ తీసుకున్నానని ఇప్పుడు బాగానే ఉన్నానని ఐరా తెలిపారు.

ఓ ఏడాదిగా మానసిక ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని అనుకుంటూనే ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకునే మిమ్మల్ని నా ప్రయాణంలో భాగం చేయాలనుకున్నాను. అసలు నేను డిప్రెషన్‌లో ఎందుకు ఉన్నాను? ఏంటి అనే విషయాలు గురించి చెప్పాలని అనుకున్నాను అని తెలిపింది. తాను క్లినికల్లీ డిప్రెస్డ్ అని స్వయంగా ఐరా ఖాన్ వెల్లడించింది.

'హాయ్.. నేను డిప్రెషన్ లో ఉన్నాను. దాదాపు నాలుగు సంవత్సరాలుగా డిప్రెషన్ లో ఉన్నాను.. నేను డాక్టర్ ను కూడా సంప్రదించాను.. ప్రస్తుతం బాగానే ఉన్నాను.' అని చెప్పుకొచ్చింది. నేను నా ప్రయాణాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను.. అందరూ మెంటల్ ఇల్నెస్ ను అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉన్నానని తెలిపింది ఐరా.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వ్యవహారంలో డిప్రెషన్ అనే పదాన్ని ఇటీవలి కాలంలో ఎంతో మంది విన్నారు. స్టార్ కిడ్ కాకపోవడం వలన సుశాంత్ ను బాలీవుడ్ లో తొక్కేయాలని చూశారని.. అందుకే అతడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని అన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె కూడా తాను డిప్రెషన్ లోకి వెళ్లాలని చెప్పి.. మరోసారి ఆ పదాన్ని వార్తల్లోకి తీసుకుని వచ్చింది.

Next Story