విరాట్‌కు అనుష్క 'ఫ్లయింగ్ కిస్‌'.. ఫోటోలు వైరల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 8:41 AM GMT
విరాట్‌కు అనుష్క ఫ్లయింగ్ కిస్‌.. ఫోటోలు వైరల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికల్లో నాలుగో స్థానంలో ఉంది. కాగా.. ఈ సీజన్‌ ప్రారంభంలో ఆర్‌సీబీ ఆడిన తొలి మూడు మ్యాచుల్లో ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లీ విఫలం కావడానికి కారణం అతడి భార్య అనుష్క నే అని భారీగా ట్రోల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. సునీల్‌ గవాస్కర్‌ కూడా 'అనుష్క శర్మతో విరాట్‌ కోహ్లీ చేసిన ప్రాక్టీస్‌ ఇక్కడ సరిపోదంటూ 'కామెంట్‌ చేయడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.మూడు మ్యాచుల్లో విఫలమైన అనంతరం కోహ్లీ మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 72 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్‌.. శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 52 బంతుల్లో 4పోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. కోహ్లీ బ్యాటింగ్‌ అనుష్క శర్మ స్టేడియంలో కూర్చొని తిలకించింది. ఇన్నింగ్స్‌ అనంతరం పెవిలియన్‌ ఎండ్‌కు చేరుకుంటున్న విరాట్‌ను చూసి అనుష్క తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ''ఫ్లయింగ్ కిస్'‌ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 37 పరుగుల తేడాతో గెలిచింది.Next Story