ఐపీఎల్‌ను బ్యాన్ చేసిన ప్రభుత్వం
By న్యూస్‌మీటర్ తెలుగు
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న నేఫథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నీర్ణయం తీసుకోనున్నాయి. ముఖ్యంగా మార్చి 29నుండి ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఐపీఎల్ విషయంలో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని బ్యాన్ చేయనున్నట్లు ప్రకటిస్తున్నాయి.
ఈ విషయమై ఇప్పటికే.. మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్‌ని బ్యాన్ చేయడంతో పాటు టిక్కెట్ల అమ్మకాన్ని కూడా నిషేదించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఐపీఎల్‌ని బ్యాన్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది. స్పోర్ట్స్, మీటింగ్స్, కాన్ఫరెన్స్ కార్యక్రమాలన్నింటిని రద్దు చేస్తున్నట్టు హెల్త్ సెక్రటరీ పద్మిని సింగ్లా తెలిపారు.
ఇదిలావుంటే.. ఢిల్లీలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవల ఫ్రాన్స్, చైనాకి వెళ్ళొచ్చిన వ్యక్తికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకూ 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 76 కు చేరింది. ఎవరు గుంపులు గుంపులు గా ఏర్పడకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.