జెలెన్ స్కీ భావోద్వేగం.. నన్ను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కొవొచ్చు
Zelenskyy’s ‘desperate’ plea to Congress Send more planes.ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా
By తోట వంశీ కుమార్ Published on 6 March 2022 11:01 AM GMTఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా సైనికులకు ధీటుగా ఉక్రెయిన్ బలగాలు కూడా సమాధానం ఇస్తున్నాయి. ఈ యుద్ధంలో ఎంతో మంది సామాన్య ప్రజలతో పాటు ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ దేశంలోని ఒక్కొనగరంపై రష్యా పట్టు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించాలని, యుద్ధంలో తమకు సాయం చేయాలని ఉక్రెయిన్ పలు దేశాధినేతలతో మాట్లాడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా చట్ట సభలోని 300 మంది సభ్యులతో దాదాపు గంటపాటు మాట్లాడారు. రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఇవే తన చివరి మాటలు కొవొచ్చునని, తనను సీజవంగా చూడడం ఇదే చివరిసారి కొవచ్చునని భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.
తాను ఇంకా రాజధాని కీవ్‌లోనే ఉన్నట్లు చెప్పాడు. తమ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోను మరోసారి విజ్ఞప్తి చేశారు. తమ సైనికులు సోవియట్ కాలం నాటి మిగ్ 29 యుద్ధ విమానాలనే వాడుతున్నారని, నాటోలో చేరిన పోలెండ్ వంటి దేశాలు యుద్ధ విమానాలను అప్ గ్రేడ్ చేసుకున్నాయని తెలిపారు. తమ సైనికులకు ఆధునిక యుద్ధ విమానాలు నడపడంలో సరైన శిక్షణ లేదని, అందుకనే పోలెండ్ వంటి దేశాల నుంచి సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలను ఇప్పించాలని కోరారు. దాని వల్ల శిక్షణ తీసుకునే అవసరం తగ్గుతుందన్నారు.
అనంతరం ఉక్రెయిన్ ప్రజలనుద్దేశించి మరోసారి ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యాన్ని వదులుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు సిద్దంగా లేరన్నారు. ఆక్రమణదారుల నుంచి మాతృభూమిని కాపాడుకుంటామన్నారు. ఉక్రెయిన్ దళాల ప్రతిఘటన రష్యా దళాలకు అవమానకరమని తెలిపారు. ప్రతి అంగుళం భూమిని రక్షించుటామన్నారు. ఉక్రెనియన్లు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని, శత్రువు ప్రవేశించిన అన్ని నగరాల్లో పోరాడతాం అంటూ జెలెస్కీ తెలిపారు.