చైనా అధ్యక్షుడిగా మూడోసారి షీజిన్‌పింగ్
Xi Jinping for the third time as the President of China. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆదివారం చరిత్ర సృష్టించారు. చైనా దేశ అధ్యక్షుడిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా మూడోసారి
By అంజి Published on 23 Oct 2022 11:13 AM ISTచైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆదివారం చరిత్ర సృష్టించారు. చైనా దేశ అధ్యక్షుడిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా మూడోసారి కూడా షీ జిన్‌పింగ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిన్‌పింగే స్వయంగా ప్రకటించారు. ఇక చైనా ప్రధానిగా జిన్‌పింగ్ విధేయుడు లీ కియాంగ్‌కు ఎన్నికయ్యారు. ఇప్పటికే ఆ స్థానంలో లీకెకియాంగ్ (67) రెండుసార్లు పదవికాలం కావడంతో పూర్తి కావడంతో అతన్ని తొలగించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్‌ను.. షాంఘైలో జరిగిన సమావేశంలో ప్రధాని పదవికి ఎంపిక చేశారు.
అలాగే పార్టీ పొలిట్‌బ్యూరో, స్టాండింగ్ కమిటీ కొత్త సభ్యులు పేర్లను కూడా వెల్లడించారు. స్టాండింగ్ కమిటీలో షీ జిన్‌పింగ్, లీ కియాంగ్, ఝావో లిజి, వాంగ్ హునింగ్, కాయి కి, డింగ్ షూషాంగ్, లీషీకును ఎన్నుకున్నారు. ఎన్నిక పూర్తయ్యాక జిన్‌పింగ్ మాట్లాడారు. పార్టీ కాంగ్రెస్ సమావేశాలను విజయవంతంగా ముగించామని చెప్పారు. పార్టీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఉంచామని, పార్టీని భవిష్యత్తులో మరింత సమిష్టిగా నడపడానికి నాయకులను సమ్మిళితం చేశామని చెప్పారు. అంతర్జాతీయ సమాజం తమ పార్టీ సమావేశాలను నిశితంగా, ఆసక్తిగా గమనిస్తోందన్నారు.
ఇప్పటికే వివిధ దేశాధినేతలు అభినందలు తెలుపుతూ సందేశాలు పంపిస్తున్నారని జిన్‌పింగ్ వెల్లడించారు. కాగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆదివారం మూడవ ఐదేళ్ల కాలానికి తిరిగి ఎన్నికయ్యారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై తన ఉక్కు పట్టును జిన్‌పింగ్ సుస్థిరం చేసుకోవడంతో శనివారం సమావేశాలు ముగిశాయి. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత 69 ఏళ్ల జిన్‌పింగ్ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు.