ఎక్స్ లో జాగ్రత్త.. అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే ఇక అంతే..!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

By -  Medi Samrat
Published on : 4 March 2026 5:50 PM IST

ఎక్స్ లో జాగ్రత్త.. అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే ఇక అంతే..!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సృష్టించిన యుద్ధ సంబంధిత వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోతే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. క్రియేటర్లను రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి 90 రోజుల పాటు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది. కమ్యూనిటీ నోట్స్ లేదా ఏఐ టూల్స్ మెటాడేటా ద్వారా ఇలాంటి కంటెంట్‌ను గుర్తిస్తామని, ఇప్పటికే ఏఐతో రూపొందించిన కంటెంట్‌ను గుర్తించేందుకు 'మేడ్ విత్ ఏఐ' అనే లేబుల్‌ను పరిచయం చేసినట్లు ఎక్స్ తెలిపింది.

యుద్ధ సమయాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టి, ప్లాట్‌ఫామ్‌పై వాస్తవికతను కాపాడేందుకు ఎక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏఐ టెక్నాలజీతో ప్రజలను తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను సృష్టిస్తూ ఉండడంతో ఎంతో మంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక సస్పెన్షన్ తర్వాత కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే, రెవెన్యూ ప్రోగ్రామ్ నుంచి కంటెంట్ క్రియేటర్లను శాశ్వతంగా తొలగించనున్నారు.

Next Story