ప్రపంచవ్యాప్తంగా X, ChatGPT డౌన్‌.. కార‌ణం ఇదే..!

ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్ డౌన్ అయినట్లు రిపోర్ట్‌లు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X డౌన్ కావడం వినియోగ‌దారులు ఇబ్బందులు డ్డారు.

By -  Medi Samrat
Published on : 18 Nov 2025 8:05 PM IST

ప్రపంచవ్యాప్తంగా X, ChatGPT డౌన్‌.. కార‌ణం ఇదే..!

ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్ డౌన్ అయినట్లు రిపోర్ట్‌లు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X డౌన్ కావడం వినియోగ‌దారులు ఇబ్బందులు డ్డారు. దీనితో పాటు AI ప్లాట్‌ఫారమ్ ChatGPT, ఇతర వెబ్‌సైట్‌లు కూడా నిలిచిపోయాయి. ఇంటర్నెట్‌లో వేలాది మంది వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకోలేకపోతున్నామ‌ని ఫిర్యాదు చేస్తున్నారు.

క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆన్‌లైన్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం, కంటెంట్‌ను వీక్షించడం లేదా లాగిన్ చేయడం, సైన్ అప్ చేయడంలో వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ కూడా పని చేయడం లేదు.

ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్ అంతరాయం కారణంగా ఇంటర్నెట్‌లో ఈ సమస్య మొదలైంది. వెబ్‌సైట్‌లు రీస్టార్ట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాయి. దీని తర్వాత క్లౌడ్‌ఫ్లేర్ స్పందిస్తూ.. తమ సర్వర్‌లలో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా.. కొన్ని వెబ్‌సైట్‌లు సరిగ్గా పనిచేయడం లేదు. క్లౌడ్‌ఫ్లేర్ వారు సమస్యను పరిశోధిస్తున్నారని చెప్పారు.

Next Story