ఏ మాత్రం మారని ఇమ్రాన్ ఖాన్.. అత్యాచారాలకు.. పొట్టి బట్టలకు లింక్ పెట్టాడు

Woman Wearing Very Few Clothes. ఆయన పాకిస్తాన్ దేశానికి ప్రధాని.. మీ దేశంలో ఎందుకు అత్యాచారాలు ఎక్కువగా ఉన్నాయని

By M.S.R  Published on  22 Jun 2021 3:12 PM IST
ఏ మాత్రం మారని ఇమ్రాన్ ఖాన్.. అత్యాచారాలకు.. పొట్టి బట్టలకు లింక్ పెట్టాడు

ఆయన పాకిస్తాన్ దేశానికి ప్రధాని.. మీ దేశంలో ఎందుకు అత్యాచారాలు ఎక్కువగా ఉన్నాయని అడిగితే మహిళలు పొట్టి బట్టలు వేసుకుంటూ ఉన్నారు.. అందుకే ఇలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని నోటికి వచ్చింది చెప్పాడు. ఇక ఆయన మాటలు అంతర్జాతీయంగా టెలికాస్ట్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆయన్ను దుమ్మెత్తిపోస్తున్నారు.

మహిళల వస్త్రధారణపై ఇమ్రాన్ ఖాన్ ఏకంగా అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారు ధరించే దుస్తుల వల్లే పాక్ లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ ను తీవ్రంగా విమర్శించారు. "ఆక్సియోస్ ఆన్ హెచ్‌బిఓ" కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ "ఒక మహిళ చాలా తక్కువ బట్టలు ధరిస్తే పురుషులపై ప్రభావం చూపుతుంది." అని అన్నారు. ''మహిళలు గుడ్డపీలికలు కట్టుకుంటే మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఆ మగవారు రోబోలైతే తప్ప. ఇది మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం అంతే'' అని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు.

పాకిస్థాన్ లో పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ప్రధాని ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో లైంగిక హింస కేసులు పెరగడానికి మహిళలు అభ్యంతకరంగా బట్టలు వేసుకోవడమేనని ఏప్రిల్ నెలలో ఇమ్రాన్ ఖాన్ ఒకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Next Story