బకింగ్‌హామ్ ప్యాలెస్ వెలుపల శ్రేయోభిలాషులను పలకరిస్తున్నప్పుడు కింగ్ చార్లెస్ IIIకి ముద్దు ఇచ్చింది ఓ మహిళ. ఈ పనికి తానేమీ సిగ్గు పడడం లేదని.. రాయల్ ఫ్యామిలీకి చెందిన వీరాభిమాని చెప్పారు. జెన్నిఫర్ అస్సిమినియోస్ శుక్రవారం నాడు కింగ్ చార్లెస్ III చెంపపై ముద్దు పెట్టుకోవడం కెమెరాలో రికార్డు అయింది.
ఆమె తనను తాను రాజ కుటుంబానికి భారీ అభిమానిగా వర్ణించుకుంది. రాజకుటుంబానికి చెందిన ఎన్నో ఈవెంట్స్ లో ఆమె పాల్గొంది. అందుకు సంబంధించిన పలు ఫోటోలు ఆమె ఇంట్లో ఉన్నాయి. ఇక రాణి మరణ వార్త విన్నప్పుడు కుటుంబానికి చాలా బాధగా అనిపించిందని, తన భర్త జార్జ్ మరణించిన తర్వాత ఎంత బాధ కలిగిందో.. ఇప్పుడు కూడా అంతే బాధ కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది.
ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్ 3 బ్రిటన్‌కు నూతన రాజుగా బాధ్యతలు చేపట్టనన్నారు. తన తల్లి జీవితకాలం మొత్తం ఈ దేశం కోసమే సేవ చేశారని, ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను ఏలిన సామ్రాజ్ఞి ఎలిజబెత్ పరిపూర్ణ జీవితం గడిపారని ఛార్లెస్ అన్నారు. తన తల్లి చిత్రపటాన్ని పక్కనే పెట్టుకుని ఛార్లెస్ తొలి ప్రసంగం చేశారు.