దావూద్ ను పాకిస్థాన్ భారత్ కు అప్పగించబోతోందా?
Will Pakistan hand over Dawood Ibrahim to India. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ పర్యటనలో ఉన్నారు.
By Medi Samrat Published on 6 May 2023 8:27 AM ISTDawood Ibrahim
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ పర్యటనలో ఉన్నారు. తాము భారత్ తో మైత్రిని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని తమ దేశం కోరుకుంటోందని, అంతే తప్ప భారత ప్రభుత్వం చెబితేనే తాము దీనిపై దృష్టి పెట్టామనడం సరికాదని అన్నారు. ఇక భారత్ మీద ఎన్నో కుట్రలు పన్నిన తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తూ ఉంది. వారిలో దావూద్ ఇబ్రహీం కూడా ఒకరు.
కరాచీలో నివసిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ కు అప్పగించాలానే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. తాజాగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి అదే ప్రశ్న ఎదురైంది. ఇండియా టుడే టీవీ కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, దావూద్ ఇబ్రహీం కరాచీలోని క్లిఫ్టన్‌లో నివసిస్తున్నాడని భావిస్తున్నారని.. అలాంటప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటోందని ఎలా నమ్మగలం అని ప్రశ్నించారు. 2019 ఆగస్టు 5న అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి స్థంభించిందని బిలావల్ భుట్టో అన్నారు. దావూద్‌ను భారత్‌కు అప్పగించడం వలన ఇరు దేశాల మధ్య శాంతిని పెంపొందించే చర్యగా పనిచేస్తుందేమో అని బిలావల్ భుట్టో అన్నారు.
1993 ముంబై వరుస పేలుళ్లతో సహా భారతదేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు దావూద్ ఇబ్రహీం. కరాచీలో ఉండి ఈ పనులన్నీ చేస్తున్నాడని భారత్ వాదిస్తోంది. ఇప్పటికే దావూద్ తలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి $25 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ (జేఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్, హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్, అతని సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్‌లకు పాకిస్థాన్ మద్దతు ఉంది.