ఆయ‌న వారానికి 70 గంటలు పని చేస్తాడా.? రిషి సునక్ కొత్త‌ ఉద్యోగంపై నెటిజన్ల సెటైర్లు..!

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ గోల్డ్‌మన్ సాచ్స్‌లో సీనియర్ సలహాదారుగా చేరారు.

By Medi Samrat
Published on : 9 July 2025 3:59 PM IST

ఆయ‌న వారానికి 70 గంటలు పని చేస్తాడా.? రిషి సునక్ కొత్త‌ ఉద్యోగంపై నెటిజన్ల సెటైర్లు..!

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ గోల్డ్‌మన్ సాచ్స్‌లో సీనియర్ సలహాదారుగా చేరారు. గోల్డ్‌మన్ సాచ్స్ ఒక అమెరికన్ బహుళజాతి పెట్టుబడి బ్యాంకు మరియు ఆర్థిక సేవల సంస్థ. ఇది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక సంస్థలలో ఒకటి. సునక్ అక్టోబర్ 2022 నుండి జూలై 2024 వరకు బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. గత ఏడాది కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసిన తర్వాత సునక్ ఇటీవ‌ల గోల్డ్‌మన్ సాచ్స్‌లో సీనియర్ సలహాదారుగా చేరారు.

సునక్ 21 సంవత్సరాల విరామం తర్వాత వాల్ స్ట్రీట్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌కి తిరిగి వస్తున్నారు. అంతకుముందు ఆయ‌న‌ అక్కడ సమ్మర్ ఇంటర్న్‌గా, తరువాత జూనియర్ అనలిస్ట్‌గా పనిచేశాడు.

గోల్డ్‌మన్ శాక్స్‌తో సునక్ అనుబంధంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. గోల్డ్‌మ్యాన్ సాక్స్‌కు బదులుగా అతని భార్యకు బలమైన కుటుంబ సంబంధాలు ఉన్న ఇన్ఫోసిస్‌లో చేరడం గురించి ఆలోచించాలని కొందరు వినియోగదారులు సూచించారు.

ఇన్ఫోసిస్‌లో చేరి రోజుకు 70 గంటలు పని చేసి ఉండాల్సింది అని ఓ నెటిజన్ చమత్కరించాడు. మరొక వినియోగదారు.. అతను వారానికి 70 గంటలు పని చేస్తాడా? అని ప్ర‌శ్నించాడు.

"మీ మామగారు మిమ్మల్ని వారానికి 70 గంటలు పని చేయమని బలవంతం చేస్తారు" అని సోషల్ మీడియా వినియోగదారు ఒకరు కామెంట్ చేశాడు.

రిషి సునక్ ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నారాయ‌ణ మూర్తి అల్లుడు కావ‌డం విశేషం. నారాయ‌ణ మూర్తి ఇటీవ‌ల మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి 70 గంటలు పని చేయాల‌ని వ్యాఖ్యానించాడు. దీంతో ఆయ‌న‌పై చాలా వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అల్లుడైన‌ రిషి సునక్‌ను ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలావుంటే.. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ CEO డేవిడ్ సోలమన్ కూడా సునాక్ గోల్డ్‌మన్ సాచ్స్‌లో చేరడంపై తన స్పందనను తెలియజేశారు. "రిషిని గోల్డ్‌మన్ సాక్స్‌కు సీనియర్ సలహాదారుగా తిరిగి స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని అతను చెప్పాడు.

Next Story