కరోనాపై డ‌బ్ల్యూహెచ్ఓ నివేదికలో ఏముందో చెప్పేసిన చైనా..

WHO report: COVID likely 1st jumped into humans from animals. ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా వైరస్ మూలాలపై, గబ్బిలాలు, శీతలికరించిన ఆహారం ద్వారానే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని తెలిపింది.

By Medi Samrat  Published on  30 March 2021 3:40 AM GMT
కరోనాపై డ‌బ్ల్యూహెచ్ఓ నివేదికలో ఏముందో చెప్పేసిన చైనా..

ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాతంత్ర్య దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు పూర్తయింది అన్న సమాచారం బయటకు వచ్చింది అయితే WHO బృందం దర్యాప్తు నివేదిక ఇంకా విడుదల చేయలేదు. కానీ ఈ విషయమై చైనా మాత్రం ముందే ఓ ప్రకటన విడుదల చేసినట్టుగా అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.

కరోనా మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాలో పర్యటించి సేకరించింది.గబ్బిలాలు, శీతలికరించిన ఆహారం ద్వారానే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుండి ఇది బయటకు వచ్చే ఆస్కారమే లేదని తేల్చి చెప్పింది.

అయితే డబ్ల్యు హెచ్ ఓ కూడా దర్యాప్తు నివేదికలో ఇదే విషయాలను పేర్కొన్నట్టుగా ప్రచారం సాగుతోంది.కరోనా మూలాలపై డబ్ల్యుహెచ్ఓ రూపొందించిన నివేదిక మూసాయిదాను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది అసోసియేటేడ్ ప్రెస్ సంపాదించింది. కరోనా వ్యాధికి సంబంధించి డబ్ల్యూహెచ్వో నిపుణుల బృందం మొత్తం నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో గబ్బిలాల నుంచి ఒక మధ్యంతర జంతువులకు వ్యాపించి దానినుంచి మానవులకు ఈ వ్యాధి సంక్రమించినట్టు వివరించింది.

నిజానికి ఈ నివేదికను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంకా ఎందుకు ఆలస్యం జరుగుతోందో వివరాలు తెలియరాలేదు. అంతే కాదు కరోనా మహామ్మారి వ్యాప్తికి చైనానే కారణమనే అపవాదును తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థపై డ్రాగన్ ఒత్తిడి తెస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.తుది నివేదిక ఇలానే ఉంటుందా అనే విషయమై కూడా ఇంకా స్సష్టత లేదు. ఈ డ్రాఫ్ట్‌ నివేదికను డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశానికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని దౌత్యవేత్త ఒకరు బయటపెట్టినట్లు ఏపీ పేర్కొంది. 2019 డిసెంబర్ మాసంలో కరోనా కేసులు వెలుగు చూశాయి.ఈ వైరస్ ప్రపంచాన్ని ఇంకా గజగజలాడిస్తోంది. ఈ ఏడాది జనవరిలో వూహాన్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి బృందం పర్యటించింది.



Next Story