కరోనాకు ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు.. డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతోంది..!

What the WHO said about the end of the corona pandemic

By అంజి  Published on  25 Oct 2021 1:34 PM IST
కరోనాకు ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు..  డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతోంది..!

కరోనా మహమ్మారి అంతం.. పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుతోంది. మన మెడికల్‌ టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించినప్పుడు కరోనాకు చెక్‌ పెట్టవచ్చని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ తెలిపారు. జర్మనీ క్యాపిటల్‌ సిటీ బెర్లిన్‌లో ప్రపంచ ఆరోగ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో టెడ్రోస్‌ పాల్గొన్ని ప్రసంగించారు. ''కరోనా మహమ్మరి అంతం ఎప్పుడు అంటూ గత సంవత్సరకాలంగా చాలా మంది నన్ను అడుగుతున్నారని, వారందరికి ఇదే నా సమాధానం అని చెప్పుకొచ్చారు.'' మన దగ్గరనున్న మెడికల్‌ టూల్స్‌తో వైరస్‌ను అంతం చేయొచ్చన్నారు. ప్రజారోగ్య సాధనాలు, మందులు ఉన్న కూడా.. వాటిని ప్రపంచం సరిగా వాడుకోవట్లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు ఎంతో మంది బలవుతున్నారని, వారానికి దాదాపు 50 వేల మందిని కరోనా పొట్టన పెట్టుకుంటోందని టెడ్రోస్‌ అధానమ్‌ వ్యాఖ్యనించారు.

కరోనా అంతానికి మనం చాలా దూరంలో ఉన్నామంటూ టెడ్రోస్ చెప్పుకొచ్చారు. సంపూర్ణ ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు.. ఎందుకంటే ఆరోగ్యం సంపన్న వ్యక్తులకు లగ్జరీ కాదని కరోనా మహమ్మారి నిరూపించిందన్నారు. ప్రపంచం నుండి విడువడి ఏ దేశం కూడా కరోనాను అంతం చేయలేదన్నారు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ విజృంభణ తగ్గుముఖం పట్టినట్లు కన్పించింది. కానీ తాజాగా కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తూ.. విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. బ్రిటన్‌, రష్యా దేశాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభణ ఆగడం లేదు. కరోనా పంజా విసురుతున్న దేశాల్లో... ఆయా ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. భారత్‌లో ప్రస్తుతం 20 వేల మార్క్‌ దిగువన కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

Next Story