పుతిన్ పడిపోయాడా.. క్రెమ్లిన్‌ క్లారిటీ ఇచ్చేనా..?

Vladimir Putin falls down stairs at residence, soils himself amid cancer battle. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయినట్

By M.S.R  Published on  3 Dec 2022 9:00 PM IST
పుతిన్ పడిపోయాడా.. క్రెమ్లిన్‌ క్లారిటీ ఇచ్చేనా..?
రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన మెట్లపై నుంచి జారి పడిపోతుండగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనకు సహాయం చేసి, సోఫాలో కూర్చోబెట్టినట్లు సమాచారం. ఆయన వ్యక్తిగత వైద్యులు హుటాహుటిన వెళ్లి, ఆయనకు చికిత్స చేశారని తెలుస్తోంది. జనరల్ ఎస్‌వీఆర్ అనే రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ ఈ వార్తను వెల్లడించింది. మెట్లపై నుంచి జారి పడిపోవడంతో ఆయన కీళ్లు వాచినట్లు, ప్రేగుల్లో కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నట్లు తెలిపింది. వైద్యులు ఆయనను బాత్రూమ్‌కు తీసుకెళ్లి, శుభ్రం చేసుకోవడానికి సహాయపడినట్లు తెలిపింది. అనంతరం కీళ్ల వద్ద వాచినట్లు గుర్తించి, పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్లు పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ఎటువంటి ఆధారాలను సదరు చానల్ చూపించలేదు, కేవలం విశ్వసనీయ వర్గాల సమాచారం అని మాత్రమే చెప్పింది. ఈ విషయంపై క్రెమ్లిన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


Next Story