టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయనున్న ప్రభుత్వం

టెలిగ్రామ్ చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తికి అనుమతిస్తోందని, నియమ నిబంధనలను పాటించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, వియత్నాం ప్రభుత్వం టెలిగ్రామ్ యాక్సెస్‌ను నిరోధించడానికి సిద్ధమవుతోంది.

By Medi Samrat
Published on : 23 May 2025 8:20 PM IST

టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయనున్న ప్రభుత్వం

టెలిగ్రామ్ చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తికి అనుమతిస్తోందని, నియమ నిబంధనలను పాటించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, వియత్నాం ప్రభుత్వం టెలిగ్రామ్ యాక్సెస్‌ను నిరోధించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ అధికారుల ప్రకారం జాతీయ భద్రతకు హానికరమైన కార్యకలాపాలకు ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగించబడుతుందని పదేపదే ఆందోళనలు వ్యక్తం అవుతూ ఉండడంతో ఈ నిర్ణయం వచ్చింది.

వియత్నాంలోని అనేక టెలిగ్రామ్ గ్రూపులు "విషపూరిత" కంటెంట్‌కు కేంద్రాలుగా మారాయని ఆ దేశ ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక మెటీరియల్, మోసపూరిత కథనాలు, పథకాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లాంటి చట్టవిరుద్ధమైన డేటా ట్రేడింగ్ ఇందులో ఉన్నాయి. అటువంటి కంటెంట్‌ను పర్యవేక్షించడానికి లేదా తొలగించడానికి ప్రభుత్వానికి టెలిగ్రామ్ యాప్ యాజమాన్యం సహకరించలేదని వియత్నాం ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story