ఇంటర్‌పోల్ వాంటెడ్ లిస్టులో ఉన్న నేరగాడు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ..

Vice-president 'Wanted by Interpol' Plays Football Match for His Own Club. ఇంటర్‌పోల్ పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్న ఒక నేరగాడు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు

By M.S.R  Published on  23 Sep 2021 12:42 PM GMT
ఇంటర్‌పోల్ వాంటెడ్ లిస్టులో ఉన్న నేరగాడు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ..

ఇంటర్‌పోల్ పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్న ఒక నేరగాడు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. తనను తాను కెప్టెన్‌గా నియమించుకొని 54 నిమిషాలపాటు మైదానంలో ఉన్నాడు. సాధారణంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తప్పించుకుని తిరుగుతాడు కానీ.. ఇలా ఆడుతాడని ఎవరూ ఊహించలేదు. సీవోఎన్‌సీఏసీఏఎఫ్ (కాన్‌కకాఫ్) లీగ్ సందర్భంగా సురినామే క్లబ్ మ్యాచ్‌లో ఆడాడు. సురినామే క్లబ్ ఉపాధ్యక్షుడు, యజమాని అయిన రోనీ బ్రున్స్‌విక్ ఈ మ్యాచ్‌లో కనిపించాడు. ఇంటర్ మోంగెటోప్ జట్టు తరఫున అతనే మ్యాచ్ ప్రారంభించాడు.

సురినామే రాజధాని పరామారిబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో 60 సంవత్సరాల బ్రున్స్‌విక్ ఇంటర్ మోంగెటోప్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు. మ్యాచ్‌లో 54 నిమిషాలపాటు ఉన్న బ్రున్స్‌విక్ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ తర్వాత వేరే ఆటగాడు అతని స్థానంలో వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతని జట్టు 0-6 గోల్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమిపై క్లబ్ అభిమానులు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు. బ్రున్స్‌విక్ కోసం చాలా కాలంగా ఇంటర్‌పోల్ వెదుకుతోంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అతనిపై కేసులు ఉన్నాయి.


Next Story