ప్రముఖ హాస్యనటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

Veteran comedian Umer Sharif passes away. ప్రముఖ పాకిస్తానీ హాస్యనటుడు ఉమర్ షరీఫ్ జర్మనీలో కన్నుమూసినట్లు స్థానిక మీడియా

By Medi Samrat  Published on  2 Oct 2021 6:27 PM IST
ప్రముఖ హాస్యనటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

ప్రముఖ పాకిస్తానీ హాస్యనటుడు ఉమర్ షరీఫ్ జర్మనీలో కన్నుమూసినట్లు స్థానిక మీడియా తెలిపింది. చికిత్స కోసం అమెరికా వెళ్తుండగా ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఉమర్ షరీఫ్ మరణం పట్ల ప్రెసిడెంట్ డాక్టర్ ఆరిఫ్ అల్వి, పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. షరీఫ్ కామెడీ రంగంలో విశిష్టతను సంపాదించుకున్నారని, తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారని పాక్ మీడియా తెలిపింది. ఉమర్ షరీఫ్ నటన, కామెడీలో విశిష్ట స్థానాన్ని అందుకున్నారని ఇమ్రాన్ తెలిపారు.

ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని పలువురు తెలిపారు. అతని మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు కళాకారులు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో నివాళులు అర్పించారు. మరణించేనాటికి ఆయన వయసు 66 సంవత్సరాలు. ఉమర్‌షరీఫ్ మరణ వార్త విన్న వెంటనే హృదయ విదారకంగా మారింది. అతను మా పరిశ్రమలో నిజమైన రత్నం. అల్లాహ్ అతనికి జన్నాలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాడు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానంటూ పాకిస్తాన్ నటుడు పైజల్ ఖురేషి సంతాపం వ్యక్తం చేశారు.


Next Story