కరోనా వ్యాక్సిన్ పేటెంట్ల రచ్చ.. భారత్ కు అమెరికా మద్దతు
US to support India-South Africa WTO proposal.కరోనా వ్యాక్సిన్ల పేటెంట్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతూ
By తోట వంశీ కుమార్ Published on 6 May 2021 3:33 PM GMTకరోనా వ్యాక్సిన్ల పేటెంట్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. భారత్ కరోనా వ్యాక్సిన్లపై పేటెంట్ల మినహాయింపు కోసం పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటానికి అమెరికా మద్దతు తెలపడం విశేషం. కొవిడ్ టీకాకు పేటెంట్ల నుంచి మినహాయింపు ఇవ్వాలనే భారత్ వాదన సరైనదే అని అగ్రరాజ్యం అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని భారత్, దక్షిణాఫ్రికా దేశాలు చెప్పినప్పటికీ తయారీ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. అమెరికా ట్రేడ్ ర్రిప్రజెంటేటివ్ కేథరిన్ టై మాత్రం, ప్రస్తుత పరిస్థితుల్లో పేటెంట్ గురించి చర్చ అనవసరం అన్నారు. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలని.. వ్యాపారాలకు మేథోపరమైన హక్కుల రక్షణ అత్యంత కీలకమని అమెరికా కూడా అభిప్రాయపడింది. వంద మంది సభ్యులున్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) వచ్చే నెలలో జరగనున్న సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు.
కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లు, పేటెంట్ల ద్వారా రక్షించే ఉత్పత్తులు, ఇన్నోవేషన్లను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. ఇలాంటి ఉత్పత్తులు రూపొందించినందుకు వారికి డబ్బులు రివార్డు రూపంలో ఇస్తారు. కరోనా సమయంలో పేటెంట్ల విధానానికి స్వస్తి పలకాలని భారత్, దక్షిణాఫ్రికా సహా 60 దేశాలు చెబుతూ ఉన్నాయి. బ్రిటన్, యురోపియన్ యూనియన్, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోని యూఎస్ ప్రభుత్వం వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం ఓకే చెప్పింది. బైడెన్ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో) డీజీ ట్రెడ్రోస్ అథనోమ్ స్వాగతించారు. కరోనాపై పోరులో ఇదొక మైలురాయిగా డబ్ల్యూహెచ్‌వో అభివర్ణించింది.