డెట్రాయిట్ తూర్పు ప్రాంతానికి చెందిన ఒక అమెరికన్ చనిపోయారు. ఆయనకు చివరి కోరిక ఒకటి ఉంది. తన సమాజానికి మరపురాని విధంగా ఏదైనా తిరిగి ఇవ్వాలని భావించాడు. తన అంత్యక్రియల సమయంలో ఆకాశం నుండి డబ్బును కురిపించడానికి హెలికాప్టర్ వచ్చింది.
58 ఏళ్ల డారెల్ "ప్లాంట్" థామస్ తన ప్రజలకు ఇచ్చిన చివరి బహుమతి. అతని అంత్యక్రియల రోజున, అతని కుమారులు డేరెల్, జోంటే డబ్బును, గులాబీ రేకులను ఒక హెలికాప్టర్ నుండి జారవిడిచారు. కానర్ స్ట్రీట్ సమీపంలోని గ్రాటియట్ అవెన్యూ మీదుగా హెలికాప్టర్ నుండి వేల డాలర్లు, గులాబీ రేకులు పడ్డాయి. జూన్ 27న మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో సుమారు $5,000 (రూ. 4,27,700) నగదు వర్షం కురిపించారు. ఆయన సమాజానికి ఎంతో మంచి చేశారని, ఎన్నో దానాలు కూడా చేశారని అతడి బంధువులు తెలిపారు. ఇది తాము ఆయనకు ఇస్తున్న నివాళి అని వివరించారు.