భారత్ లో రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్ల లోటు భారీగా ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో భారత్ ను ఆదుకోడానికి అమెరికా ముందుకు వచ్చింది. అమెరికా భారత్ కు ఒక లక్షా 25 వేల ఇంజెక్షన్లను భారత్ కు పంపించింది. భారత్ కు ఇంకా సహాయం అందిస్తామని.. మెడికల్ సాయం తప్పకుండా ఉంటుందని అమెరికా వెల్లడించింది. ఆదివారం నాడు అమెరికా నుండి 1.25 లక్షల రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లు భారత్ కు చేరుకున్నాయి. శనివారం రాత్రి కూడా అమెరికా నుండి 1000 ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్మెంట్లు అమెరికాకు చేరుకున్నాయి. శుక్రవారం నాడు కూడా రెండు విమానాలలో భారత్ కు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ ను అమెరికా పంపించింది.
రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్ల విషయంలో భారత్ లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లకు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల కోసం వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు నిర్ణయించిన టీకా ధరలు మరీ అధికంగా ఉన్నాయని స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్.జే.ఎం.) ఆందోళన వ్యక్తం చేసింది. చౌకధరలకే వ్యాక్సిన్లు లభ్యమయ్యేలా వ్యయభారాన్ని కేంద్రం నియంత్రించాల్సిన అవసరం ఉందని ఎస్‌జేఎం కోకన్వీనర్ అశ్వని మహాజన్ తెలిపారు.