వేరే దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. డాక్టర్‌ చేసిన చిన్న పొరపాటుతో..!

US Couple who opt ivf. మాతృత్వం కోసం ప్రతి మహిళ పరితపిస్తుంటుంది. అమ్మ అని పిలిపించుకునేందుకు మహిళ ఎన్నో కలలు ఉంటుంది. కొందరు మహిళలకు

By అంజి  Published on  9 Nov 2021 5:02 PM IST
వేరే దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. డాక్టర్‌ చేసిన చిన్న పొరపాటుతో..!

మాతృత్వం కోసం ప్రతి మహిళ పరితపిస్తుంటుంది. అమ్మ అని పిలిపించుకునేందుకు మహిళ ఎన్నో కలలు ఉంటుంది. కొందరు మహిళలకు సహజంగా పిల్లలు పుట్టరు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ సమస్య కూడా తీరిపోయింది. పిల్లలు పుట్టని వారికి కృత్రిమ గర్భధారణ ఒక వరంగా మారింది. ఈ ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా ఎంతో మంది మహిళలు మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో ఏ మాత్రం తేడా జరిగినా ఫలితాలు వేరేలా ఉంటాయి. తాజాగా అమెరికాకు చెందిన దంపతులు.. ఐవీఎఫ్‌ క్లినిక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. డఫ్నా, అలెగ్జాండర్‌ కార్డినాల్‌ పెళ్లి అయ్యి చాలా కాలం అవుతున్న పిల్లలు కలగలేదు.

దీంతో ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే దగ్గరనున్న ఓ ఐవీఎఫ్‌ కేంద్రానికి వెళ్లారు. ఆ తర్వాత డఫ్నా గర్భవతి అయింది.. బిడ్డను జన్మ ఇచ్చింది. ఒత్తైన నల్లటి జుట్టు, బిడ్డ రంగును చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కారణం వారి కుటుంబంలో ఎవరికి కూడా చిన్నారికి వచ్చిన పోలికలు లేవు. బిడ్డ పుట్టినప్పుడు ఇవేమి పట్టించుకోలేదు. అయితే బిడ్డ పెరుగుతున్న కొద్ది అనుమానం బలంగా పాతుకుపోసాగింది. దీంతో వారు బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేయించారు. వారిద్దరిలో ఎవరితో కూడా డీఎన్ఏ ఫలితాలు సరిపోలేదు. దీంతో అనుమానం రెట్టింపు అయ్యింది. దీంతో దంపతులు ఇద్దరు ఐవీఎఫ్‌ కేంద్రానికి వెళ్లి అక్కడి డాక్టర్‌ నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

డఫ్నా దంపతులు ఐవీఎఫ్‌ క్లినిక్‌ వచ్చిన సమయంలోనే మరో జంట కూడా కృత్రిమ గర్భధారణ కోసం పక్కనే క్లినిక్‌కు వచ్చారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఈ రెండింటిలో పని చేసే డాక్టర్‌ ఒక్కడే. పొరపాటును ఇరువురి పిండాలను తారుమారు చేశాడు. వేరే వారి పిండాన్ని డఫ్నా దంపతుల గర్భంలో ప్రవేశపెట్టారు. బిడ్డకు జుట్టు, శరీర ఛాయ వేరుగా ఉండటంతో డఫ్నా దంపతులకు అనుమానం రాగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డఫ్నా దంపతులు ఆ ఐవీఎఫ్‌ కేంద్రం మీద కేసు పెట్టారు. తమ డీఏఎన్‌ఏ కలిగిన బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రెండు జంటలు తమ తమ డీఎన్‌ఏ కలిగిన బిడ్డలను పరస్పరం మార్చుకున్నాయి. సొంత బిడ్డలతో ఇంటికి వెళ్లారు.

Next Story