ఇంకొద్ది రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం నుండి దిగిపోతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ట్రంప్ కు షాక్ ఇస్తూ అమెరికా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రక్షణ బిల్లుపై అభ్యంతరాలు చెబుతూ జాప్యానికి కారణమవుతున్న ట్రంప్ కు అధ్యక్షుడి వీటో అధికారాన్ని తిరగరాసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. వీటో అధికారాన్ని తిరగరాసేందుకు ప్రవేశపెట్టిన బిల్లును సెనేట్ 81-13 ఓట్లతో ఆమోదించింది. అధికార రిపబ్లికన్ సభ్యులు కూడా ఇందుకు మద్దతు పలికారు. ప్రతినిధుల సభలోనూ ట్రంప్‌కు ఇలాంటి అవమానమే ఎదురైంది. వీటో అధికారాన్ని కోల్పోవడంపై ట్రంప్ మాట్లాడుతూ మెరుగైన రక్షణ బిల్లును ప్రతిపాదించే అవకాశాన్ని సెనేట్ చేజార్చుకుందని అన్నారు. సెనేట్ ఆమోదంతో వీటో బిల్లు చట్టంగా మారింది. ఫలితంగా 740.5 బిలియన్ డాలర్ల రక్షణ విధానానికి మార్గం క్లియర్ అయింది. ఈ బిల్లు ద్వారా లక్షలాదిమంది అమెరికా సైనికులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి. 'హజార్డస్ డ్యూటీ పే' కింద ఇప్పటి వరకు చెల్లించిన నెలవారీ భృతి 250 డాలర్ల నుంచి 275 డాలర్లకు పెరగనుంది.
ట్రంప్ తన పదవి నుండి దిగిపోయే లోపు ఎన్నో చట్టాలను తీసుకుని రావాలని గత కొద్దిరోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ నిర్ణయం తీసుకుంటాడో ట్రంప్ అని భయపడుతూ ఉన్నారు. దీంతోనే వీటో అధికారాలను లాగేసుకున్నారని భావిస్తూ ఉన్నారు.