టారిఫ్ వార్‌కు బ్రేక్..అమెరికా-చైనా మధ్య కుదిరిన ఒప్పందం
అమెరికా, చైనా మధ్య సంచలన ఒప్పందం కుదిరింది.
By Knakam Karthik
టారిఫ్ వార్‌కు బ్రేక్..అమెరికా-చైనా మధ్య కుదిరిన ఒప్పందం
అమెరికా, చైనా మధ్య సంచలన ఒప్పందం కుదిరింది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న టారిఫ్ వార్‌కు రెండు అగ్రదేశాలు పుల్‌స్టాఫ్ పెట్టేశాయి. అయితే ఇది కేవలం 90 రోజులు మాత్రమే. 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేసి, పరస్పర సుంకాలను తగ్గించడానికి అంగీకరించాయి. అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి 10 శాతానికి తగ్గించింది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145 నుంచి 30 శాతానికి తగ్గించింది.
అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికైన తర్వాత ప్రపంచంలోని వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను అమాంతం పెంచేశాడు. దీంతో వరల్డ్ మార్కెట్స్ కుదేలయ్యాయి. అమెరికా సైతం ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తుందని నిపుణులు వార్నింగ్ ఇవ్వడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే చైనాపై మాత్రం మూడు రెట్ల రెట్టింపు సుంకాలను బాదాడు. అనంతరం చైనా కూడా అమెరికాపై మూడు రేట్ల సుంకాలను పెంచడంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ జరిగింది. కాగా ఎవరూ ఉహించని విధంగా ఈ రోజు అమెరికా, చైనా మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.