విమానంలో ఏకంగా ఆ ఆయుధాన్ని తీసుకుని వెళ్లాలని అనుకున్నారే..!

US Airport Seizes 84 mm Calibre Weapon From Passenger's Baggage. మనం సినిమాల్లో చూస్తూ ఉంటామే.. హీరోలు, విలన్లు భుజాల మీద పెట్టుకొని ఒక చిన్న రాకెట్

By M.S.R  Published on  18 Jan 2023 8:45 PM IST
విమానంలో ఏకంగా ఆ ఆయుధాన్ని తీసుకుని వెళ్లాలని అనుకున్నారే..!

మనం సినిమాల్లో చూస్తూ ఉంటామే.. హీరోలు, విలన్లు భుజాల మీద పెట్టుకొని ఒక చిన్న రాకెట్ లాంటి దాన్ని ప్రత్యర్థుల మీదకు విడిచిపెడుతూ ఉంటారు. దాన్నే బజూకా అని అంటూ ఉంటారు. అలాంటి ఆయుధాన్ని ఏకంగా విమానంలో తీసుకుని వెళ్లాలని అనుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టిఎస్‌ఎ) సోమవారం ప్రయాణీకుల సామాను నుండి మిలిటరీ ట్యాంక్‌ను కాస్తా పేల్చివేయగల శక్తివంతమైన బాజూకా లాంటి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుంది. కార్ల్ గుస్టాఫ్ రీకోయిల్‌లెస్ రైఫిల్‌ను పోలి ఉండే ఆయుధం టెక్సాస్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. TSA అధికారులు తనిఖీ చేసిన లగేజీలో ఈ 84-mm క్యాలిబర్ ఆయుధాన్ని కనుగొన్నారు. చెక్-ఇన్ కౌంటర్‌లో ప్రయాణీకుడి సందేహాస్పదమైన తీరుపై అనుమానాలు రావడంతో అధికారులు పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆ ఆయుధాన్ని కనుగొన్నారు. జరిమానాలు, చట్టపరమైన సమస్యలను నివారించడానికి ప్రయాణీకులు వారి ఆయుధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని TSA సౌత్‌వెస్ట్ ఈ సందర్భంగా తెలిపింది.

Next Story