భారత్ కు చేరుకున్న రిషి సునక్
By Medi Samrat Published on 8 Sept 2023 5:07 PM ISTజీ20 సదస్సుకు హాజరయ్యేందుకు యూకే ప్రధాని రిషి సునక్ ఢిల్లీకి చేరుకున్నారు. సెప్టెంబర్ 9, 10 జీ20 సదస్సు కోసం భారత్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. భద్రతాపరమైన నిబంధనలు గురువారం రాత్రి నుండి ఒక్కటొక్కటిగా అమల్లోకి వస్తున్నాయి. తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశ రాజధానిలో అడుగు పెట్టారు. భారత ప్రభుత్వం వారికి ఘన స్వాగతం పలికింది.
జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ తదితరులు హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం భారత్‌కు రానున్నారు. ఆయనకు కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలుకనున్నారు.
ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, హాజరవడం లేదు. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన రావడం లేదు.