ఎక్కువ రోజులు పాఠశాలలను మూసివేయడంతో పిల్లలకు ఇబ్బందే

UNICEF warns of a ‘lost generation’ and finds school closures are ineffective. కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో పాఠశాలల

By Medi Samrat  Published on  22 Nov 2020 2:41 PM GMT
ఎక్కువ రోజులు పాఠశాలలను మూసివేయడంతో పిల్లలకు ఇబ్బందే

కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను మూసి వేసే ఉంచారు. పాఠశాలలను తెరవాలని చాలా దేశాల్లో అనుకున్నారు కానీ.. కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందనే భయంతో ఆ పనిని మానుకున్నారు. కొన్ని దేశాల్లో చాలా జాగ్రత్తలను తీసుకుని పాఠశాలలను నిర్వహిస్తూ ఉన్నారు. తక్కువ మందే పిల్లలు ఉండేలా.. సామాజిక దూరం పాటించేలా.. ఇలా ఎన్నో నిబంధనలతో పాఠశాలలను నడుపుతూ ఉన్నారు.

ఇలా ఎక్కువ రోజులు పాఠశాలలను మూసి వేయడం కూడా సరైన నిర్ణయం కాదని.. పిల్లల మానసిక ప్రవర్తన మీద కూడా పడుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. పాఠశాలల మూసివేత కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ తెలిపింది. బాల్యం, కౌమారదశల్లో ఉన్న చిన్నారుల్లో 70 శాతం మందికి మానసిక ఆరోగ్య సేవలు అందడం లేదని.. కౌమార దశలో ఉన్న వారిలో మానసిక సమస్యలు వృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు.

పాఠశాలల మూసివేత, పరీక్షల వాయిదా వల్ల సహచరుల మద్దతును, వారి జీవితంలో అత్యంత గొప్ప క్షణాలను వారు కోల్పోతున్నారని యూనిసెఫ్ నివేదిక వివరించింది. పాఠశాలలు మూసివేయడం వలన ఎక్కువగా నేర్చుకునే ప్రక్రియకు విఘాతం కలుగుతుందని యూనిసెఫ్ తెలిపింది.

దీర్ఘకాలంలో ఇది వారి ఆదాయం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని యూనిసెఫ్ చెప్పింది. కాబట్టి విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లడమే మంచిదని అర్థమవుతోంది. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో.. ముందులాగ ఆడుతూ, పాడుతూ విద్యార్థులు స్కూల్స్ లో గడుపుతారో కాలమే నిర్ణయించనుంది.


Next Story