భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి తొలగింపు
Ukraine's President Sacks Ambassador To India. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్ ఎక్స్‌పెక్టెడ్ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని కైవ్ రాయబారితో పాటు,
By అంజి Published on 10 July 2022 2:16 PM ISTఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్ ఎక్స్‌పెక్టెడ్ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని కైవ్ రాయబారితో పాటు, మరో నాలుగు దేశాల్లోని తమ రాయబారులను తొలగించారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్ష అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. అయితే రాయబారులను తొలగించడానికి ప్రత్యేకమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. భారత్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరీలలో ఉక్రెయిన్ రాయబారులను తొలగించినట్లు ఆయన ప్రకటించారు. తొలగించబడిన రాయబారులకు ఉక్రెయిన్‌లోనే ఏదైనా పదవి ఇస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
రాయబారులకు కొత్త ఉద్యోగాలు అప్పగిస్తారా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని ఆయా దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ దౌత్యవేత్తలను జెలెన్స్కీ కోరారు. అయితే కొన్ని దేశాలు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. మరికొన్ని దేశాలు వారి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రష్యా దాడిని బహిరంగంగా ఖండించేందుకు ముందుకు రాలేదు. యుద్ధం ఆపేసి శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. యూఎన్‌ఓలో రష్యా దాడిని ఖండిస్తూ ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది.
ఇంధన అవసరాల కోసం జర్మనీ ఎక్కువగా రష్యాపై ఆధారపడుతోంది. అందుకే రష్యా దాడిని ఖండించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రష్యా నుంచి యూరప్‌కు గ్యాస్ సరఫరా కోసం కావాల్సిన టర్బైన్ ఒకటి కెనడా నిర్వహణలో ఉంది. టర్బైన్‌ను రష్యాకు ఇవ్వాలని జర్మనీ పట్టుబడుతుండగా, ఉక్రెయిన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ టర్బైన్‌ను రష్యాకు తరలించొద్దంటోంది. అయితే ఉక్రెయిన్ అన్యూహంగా రాయబారులను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.