ఇప్పుడివి అవ‌స‌రమా..? ఉక్రెయిన్ అధ్య‌క్షుడిపై నెటిజ‌న్ల ఫైర్‌

Ukraine President Zelenskyy trolled for posing for Vogue cover with wife as war ravages country.ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 28 July 2022 3:50 AM

ఇప్పుడివి అవ‌స‌రమా..? ఉక్రెయిన్ అధ్య‌క్షుడిపై నెటిజ‌న్ల ఫైర్‌

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తీవ్ర విమ‌ర్శ‌ల్లో చిక్కుకున్నాడు. ఉక్రెయిన్ పై ర‌ష్యా సైనిక దాడి ప్రారంభిన‌ప్పుడు జెలెన్ స్కీ త‌న వ్యూహా ప్ర‌తి వ్యూహాల‌తో ర‌ష్యాకు కొర‌క‌రాని కొయ్య‌గా త‌యారైయ్యాడు. త‌న దేశం ఎన్న‌టికీ త‌ల‌వంచ‌ద‌ని చెప్ప‌డంతో పాటు ప్ర‌పంచంలోని చాలా దేశాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి ర‌ష్యాను ఎదుర్కొనడంలో స‌ఫ‌లం అయ్యాడు. యుద్ద ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు ప్ర‌జ‌ల్ని ర‌క్షించ‌డానికి యుద్ద రంగంలోకి దిగి హీరోగా నిలిచాడు.

అయితే.. ప్ర‌స్తుతం ఓ పక్క యుద్దంతో దేశం అత‌లాకుత‌లం అవుతున్న వేళ భార్య ఒలేనాతో క‌లిసి ఫోటో షూట్‌లో పాల్గొన‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ప్ర‌ముఖ మ్యాగజైన్ అయిన 'వోగ్' కోసం జెలన్ స్కీ దంప‌తులు ఇంట‌ర్య్వూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా వారు ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష భవనంలోనే ఈ ఫొటోషూట్ జ‌రిగింది. యుద్ధ పరిస్థితులకు దర్పణం పట్టేలా సైనికులు, యుద్ధ ట్యాంక్‌లు, ధ్వంసమైన విమానాలతోనూ ఒలేనా మరికొన్ని ఫొటోలు దిగారు.

ఒలెనా.. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో రావడం సాధారణ విషయం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ ఫొటోలు వోగ్ కవర్ పేజీపై రావాలని కలలు కంటారని రాసుకొచ్చారు. త‌మ క‌ల నెర‌వేరింద‌న్నారు. అందుకు యుద్ధం కారణం కాకూడదని అనుకుంటున్నానన్న ఒలెనా ఉక్రెయిన్‌లోని ప్రతి మహిళా తన స్థానంలో కవర్ పేజీపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Next Story