దిగొచ్చిన ఉక్రెయిన్.. కాళీమాతను అలా చూపించినందుకు క్షమాపణలు చెప్పింది

ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల కాళీమాత ఫోటోను అసభ్యకర రీతిలో ఉపయోగించింది. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 2 May 2023 2:15 PM IST

Ukraine, Kali tweet, Indian culture, internationalnews

దిగొచ్చిన ఉక్రెయిన్.. కాళీమాతను అలా చూపించినందుకు క్షమాపణలు చెప్పింది 

ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల కాళీమాత ఫోటోను అసభ్యకర రీతిలో ఉపయోగించింది. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ డ్జపరోవా మంగళవారం క్షమాపణలు చెప్పారు. తమ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కాళీమాతను వికృతంగా చిత్రీకరించినందుకు తాము క్షమాపణలు కోరుకుంటున్నామని తెలిపారు. తాము భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నామని.. భారతదేశం నుంచి వస్తున్న మద్దతుకు కూడా ధన్య వాదాలు అని ఎమిన్ డ్జపరోవా ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్ ను ఇప్పుడు తొలగించింది.

అంతకు ముందు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్ పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని హిందువుల మనోభావాలపై దాడిగా అభివర్ణించారు. ఈ ఫొటోపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీలి రంగు చర్మం, నాలుకను బయటపెట్టిన భంగిమ, మెడ చుట్టూ పుర్రెల దండతో అచ్చుగుద్దినట్లు కాళీమాతను పోలినట్లుగా వున్న ఆ వ్యంగ్య చిత్రం హిందూ సంస్కృతిని అపహాస్యం చేసేలా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో విమర్శలను తట్టుకోలేక ఉక్రెయిన్ దిగొచ్చింది.

Next Story