ఒమిక్రాన్‌ వేరియంట్‌కు మెడిసిన్ గుర్తించిన బ్రిటన్

UK approves new Covid-19 treatment, may work against Omicron variant. దక్షిణాఫ్రికా దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది.

By అంజి  Published on  3 Dec 2021 7:55 AM GMT
ఒమిక్రాన్‌ వేరియంట్‌కు మెడిసిన్ గుర్తించిన బ్రిటన్

దక్షిణాఫ్రికా దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. భారత్‌లో కూడా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ వేరియంట్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రిటన్‌ అంటోంది. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పని చేసే ఔషధాన్ని గుర్తించినట్లు బ్రిటన్‌ తెలిపింది. ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్‌ క్లైన్‌ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్‌ అనే ఔషధం.. ఒమ్రికాన్‌పై పని చేస్తోందని తెలిపింది. సోట్రోవిమాబ్‌ను ఉపయోగించేందుకు బ్రిటన్‌ ఆమోదం తెలిపింది. ఒమిక్రాన్‌ సోకిన వారికి సోట్రోవిమాబ్‌ ఇంజెక్షన్‌ను ఇవ్వగా.. వారిలో సానుకూల ఫలితాలు కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. సోట్రోవిమాబ్‌ ఇంజెక్షన్‌తో 79 శాతం మరణించే అవకాశం తగ్గినట్లు తెలిసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ టెన్షన్‌ మొదలైంది. అందరూ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు, కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయన్న సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరో కలవరాన్ని సృష్టించింది. మహమ్మారి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన వారిలో మొదటి డోస్‌గా సోట్రోవిమాబ్‌తో మంచి ఫలితాలు వచ్చాయి. కరోనా లక్షణాలు కనిపించిన 5 రోజుల్లోగా రోగికి సోట్రోవిమాబ్‌ ఇంజెక్షన్‌ అందించాలని బ్రిటన్‌కు చెందిన ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRAఏ) వెల్లడించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను రోనా ప్రీవ్‌ అనే మెడిసన్‌ కూడా దీటుగా ఎదుర్కొంటోందని ఎంహెచ్‌ఆర్‌ఏ తెలిపింది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అతిగా స్పందించొద్దని, పలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి.

Next Story