యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఏఈలోని పలు ప్రావిన్సుల పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరాన్ తన పద్ధతిని మార్చుకుని బుద్ధి తెచ్చుకోవాలని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇరాన్ కు ఉన్న శత్రుత్వం, వాళ్ల యుద్ధం యూఏఈ లాంటి పొరుగు దేశాలతో కాదని, ఈ విషయాన్ని వారు గుర్తుపెట్టుకుని విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు.
"గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడం ఒక తప్పుడు అంచనా, ఇది ఇరాన్‌ను ఒక క్లిష్టమైన సమయంలో ఒంటరిగా చేసింది. మీ యుద్ధం మీ పొరుగువారితో కాదు" అని యుఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపిన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యకు ప్రతీకారంగా ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అనేక ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ క్షిపణులు అబుదాబి దక్షిణ భాగంలోని అల్-దర్ఫా యుఎస్ స్థావరాన్ని తాకాయి. అల్ దర్ఫాతో పాటు, అబుదాబిలోని అనేక ఇతర ప్రాంతాలలో కూడా అదే రోజున ఇరానియన్ క్షిపణులు పడ్డాయి.