వాషింగ్టన్‌లో ఇద్ద‌రు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగుల హత్య

వాషింగ్టన్‌లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపారు.

By Medi Samrat
Published on : 22 May 2025 10:13 AM IST

వాషింగ్టన్‌లో ఇద్ద‌రు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగుల హత్య

వాషింగ్టన్‌లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపారు. ఎఫ్‌బిఐ ఫీల్డ్ ఆఫీస్‌కు కొన్ని అడుగుల దూరంలో క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియం సమీపంలో ఈ ఊచకోత జరిగింది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ సమాచారం ఇచ్చారు. బుధవారం సాయంత్రం జ్యూయిష్ మ్యూజియం సమీపంలో వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను కాల్చి చంపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ తెలిపారు.

అటార్నీ జనరల్ పామ్ బోండి హత్య గురించి మాట్లాడుతూ.. కాల్పులు జరిగినప్పుడు ఆమె మాజీ న్యాయమూర్తి జీనైన్ పిర్రోతో కలిసి సంఘటన స్థలంలో ఉన్నట్లు చెప్పారు. అదే సమయంలో బుధవారం అర్థరాత్రి జరిగిన కాల్పులకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ స్పందిస్తూ.. ఈ కాల్పులు యూదు వ్యతిరేక తీవ్రవాదం యొక్క అసహ్యకరమైన చర్యగా పేర్కొన్నారు. ఈ నేరపూరిత చర్యకు బాధ్యులైన వారిపై US అధికారులు గట్టి చర్యలు తీసుకుంటారని మేము విశ్వసిస్తున్నాము అని డానన్ X పోస్ట్‌లో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పౌరులను, ప్రతినిధులను రక్షించడానికి ఇజ్రాయెల్ కృతనిశ్చయంతో పని చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.

Next Story