అమెరికాలోని మిన్నియాపోలిస్‌లోని అన్నన్సియేషన్ క్యాథలిక్ స్కూల్‌లో బుధవారం ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించగా, 17 మంది గాయపడ్డారని బుధవారం అమెరికా న్యాయ శాఖ నివేదించింది. కాల్పులు జరిపిన తర్వాత, చర్చి వెనుక వైపు దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని రాబిన్ వెస్ట్‌మన్‌గా అధికారులు గుర్తించారని చట్ట అమలు అధికారి APకి తెలిపారు.
అయితే విద్యాసంవత్సరం ప్రారంభమైన మొదటి వారం తరగతుల మధ్యలో జరగడంతో కలకలం రేగింది. మిన్నిసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఈ దాడిని “భయంకరమైనది”గా అభివర్ణిస్తూ, “మన పిల్లలు, ఉపాధ్యాయుల మొదటి వారం తరగతులు హింసతో దెబ్బతిన్నాయి” అని సోషల్ మీడియాలో వ్రాశారు. ఈ ఘటనపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, “వైట్ హౌస్ పర్యవేక్షిస్తోంది” అని తెలిపారు.
దాదాపు 395 మంది విద్యార్థులున్న అనౌన్సియేషన్ కాథలిక్ స్కూల్ అనే ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ఈ దారుణమైన చర్య జరిగింది. స్థానిక పోలీసులు దీనిని "అమాయక పిల్లలపై ఉద్దేశపూర్వకంగా హింసాత్మక చర్య" అని పిలిచారు.