ట్రంప్‌కు ట్విట్టర్ షాక్ : అకౌంట్ శాశ్వత నిషేదం

Twitter Shock To Trump. సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చింది. అకౌంట్ శాశ్వత నిషేదం

By Medi Samrat  Published on  9 Jan 2021 4:19 AM GMT
Trump

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చింది. ఆయ‌న‌ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేఫ‌థ్యంలో ట్రంప్ తన ట్వీట్ల‌ ద్వారా హింసను ప్రేరేపించే ఆవ‌కాశ‌ముంద‌ని ట్విట్టర్ అభిప్రాయపడింది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్ల‌ను నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ వెల్ల‌డించింది.



ఇదిలావుంటే.. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌పై జో బైడెన్ విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం.. త‌న‌ను తాను విజేత‌గా ప్ర‌క‌టించుకుని.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

అయితే.. తాజాగా బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం బుధవారం యూఎస్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపు అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న మద్దతుదారులు.. భవనంలోకి దూసుకొళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు. ఈ నేఫ‌థ్యంలో స్పందించిన ట్విట్టర్.. 12 గంటలపాటు ట్రంప్‌ ట్విట్టర్ ఖాతాను నిలిపివేసింది. ఇదిలావుంటే.. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాంలు కూడా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే వరకు ట్రంప్ ఖాతాలను నిషేదిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.


Next Story