భారతీయునికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్
Twitter Gets New CEO Parag Agrawal. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ సంస్థ.. భారతీయుడికే పట్టం కట్టింది. భాతర సంతతి టెక్కీ చేతికి ట్విట్టర్ పగ్గాలు వచ్చాయి.
By అంజి Published on 30 Nov 2021 8:32 AM ISTనిన్న మైక్రోసాప్ట్, గూగుల్.. నేడు ట్విటర్. ఇలా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల చేతుల్లోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ సంస్థ.. భారతీయుడికే పట్టం కట్టింది. భాతర సంతతి టెక్కీ చేతికి ట్విట్టర్ పగ్గాలు వచ్చాయి. ట్విట్టర్ నూతన సీఈవోగా పరాగ్ అగర్వాలన్ నియామకం అయ్యారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సీఈవో పదవి నుండి సోమవారం నాడు దిగిపోయారు. ఆయన స్థానంలో ట్విటర్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2006వ సంవత్సరంలో డోర్సే మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్‌ను స్థాపించారు. అప్పటి నుండి కూడా ట్విట్టర్ సీఈవోగా డోర్సేనే కొనసాగుతు వచ్చారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత సంస్థకు కొత్త సీఈవోను నియమించారు. అది కూడా ఓ భారతీయుడికి పరాగ్ అగర్వాల్‌కు అవకాశం లభించింది. కాగా 2022లో ట్విట్టర్ సంస్థ వాటాదారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం జరిగే వరకు డోర్సే ట్విట్టర్ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతారు.
పరాగ్ అగర్వాల్ ఐఐటీ బాంబే, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. 10 ఏళ్ల క్రితం ట్విట్టర్‌లో యాడ్స్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుండి సంస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2017లో సంస్థ టెక్నికల్ చీఫ్‌గా పదోన్నతి పొందారు. తాజాగా ట్విట్టర్ సీఈవోగా ఎన్నికయ్యారు. పరాగ్ అగర్వాల్ గతంలో మైక్రోసాఫ్ట్, యాహూ తదితర సంస్థల్లో పని చేశాడు. ట్విట్టర్ బాధ్యత తనకు రావడం పట్ల గర్వపడుతున్నానని పరాగ్ అన్నారు. డోర్సే మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తానని, ఆయన స్నేహానికి కృతజ్ఞతలు తెలిపారు. "ట్విట్టర్‌తో నా ప్రయాణం మొదలై 16 ఏళ్లు కొనసాగింది, ఇప్పుడు సంస్థను వీడాలని నిర్ణయించుకున్నా, పరాగ్ అగర్వాల్‌పై పూర్తి నమ్మకం ఉంది.. ఐ లవ్ ట్విట్టర్" అంటూ డోర్నే ట్వీట్ చేశారు.