ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ తాజాగా మొరాయించింది. భారత్, బ్రిటన్, జపాన్, అమెరికా సహా అనేక దేశాల్లో యూజర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. యూజర్లకు పేజీలు లోడ్ కాలేదు. ఎర్రర్ మెసేజ్ కనిపించింది. కాసేపటి తర్వాత మళ్లీ సరిగా పని చేయడం ప్రారంభించింది. ట్విట్టర్‌లో మరోసారి ఎర్రర్ మెసేజ్ కనిపించింది. వేలాది మంది యూజర్లకు పేజీలు లోడ్ కాలేదు.
ఇటీవలి కాలంలో ట్విట్టర్ అనేక సార్లు మొరాయించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్నాక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. సాంకేతిక కారణాలతో ట్విట్టర్ అనేకసార్లు ఆగిపోయింది. ట్విటర్ డౌన్ అయిందంటూ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో యూజర్లు పోస్టులు పెడుతున్నారు. మస్క్ విపరీతంగా ఉద్యోగులను తొలగిస్తూ ఉండడమే.. ఇలా డౌన్ అవ్వడానికి కారణమని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.