200 మిలియ‌న్ల ట్విట‌ర్ యూజ‌ర్ల మెయిల్ ఐడీలు లీక్‌..!

Email Addresses Of Over 200 Million Twitter Users Leaked.మీరు ట్విట్ట‌ర్ వాడుతున్నారా..? అయితే వెంట‌నే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2023 9:35 AM IST
200 మిలియ‌న్ల ట్విట‌ర్ యూజ‌ర్ల మెయిల్ ఐడీలు లీక్‌..!

మీరు ట్విట్ట‌ర్ వాడుతున్నారా..? అయితే వెంట‌నే అప్ర‌మ‌త్తంగా ఉండండి. మీ వ్య‌క్తిగ‌త వివ‌రాలు వేరే వారి చేతుల్లో ఉండే అవ‌కాశం ఉంది. 200 మిలియన్లకు పైగా ట్విట్టర్ వినియోగదారుల ఇమెయిల్ చిరునామాలను హ్యాకర్లు దొంగిలించార‌ట‌. వీటిని ఆన్‌లైన్ హ్యాకింగ్ ఫోరమ్‌లో పోస్ట్ చేశారని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ-మానిటరింగ్ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు అలోన్ గల్ తెలిపాడు. దీని వ‌ల్ల టార్గెటెడ్ ఫిషింగ్ మరియు డాక్సింగ్ వంటి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని లింక్డ్ఇన్‌లో గ‌ల్ రాసుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను చూసిన అతి పెద్ద డేటా లీకుల్లో ఇది ఒక‌టి అని చెప్పారు.

గ‌ల్.. డిసెంబర్ 24న త‌న సోషల్ మీడియాలో 400 మిలియ‌న్ల ట్విట‌ర్ యూజ‌ర్ల ఇమెయిన్ చిరునామాలు, ఫోన్ నంబ‌ర్లు హ్యాక‌ర్లు దొంగిలించార‌ని పోస్ట్ చేశారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ట్విట‌ర్‌ స్పందించ‌లేదు. మ‌రీ దీనిపై ట్విట‌ర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. నిజం ఏంటి అనేది ఆ సంస్థే చెప్పాలి. గత సంవత్సరం ఎలోన్ మస్క్ కంపెనీ యాజమాన్యాన్ని స్వీకరించడానికి ముందు ఇది జ‌రిగింద‌ని అంటున్నారు.

గతేడాది అక్టోబర్‌లో బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. వెంట‌నే మస్క్ ప్రకటనకర్తలు కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రకటనదారులకు పంపిన సందేశంలో, మస్క్ ట్విట్టర్ నాగరికతకు మూలస్తంభం మరియు మానవాళికి సహాయం చేస్తుంది కాబట్టి దానిని కొనుగోలు చేసినట్లు తెలిపారు.

Next Story