భయపడిపోతున్న మస్క్..!

Elon Musk too is scared of ChatGPT, recruits team to develop AI tool’s rival. టెస్లా అధినేత ChatGPT ప్రత్యర్థిని అభివృద్ధి చేయడానికి ఒక బృందాన్ని నియమించుకున్నారు

By M.S.R  Published on  28 Feb 2023 4:15 PM IST
భయపడిపోతున్న మస్క్..!

ChatGPT టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ChatGPT ని ఎదుర్కోడానికి పలు టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయాలను తీసుకుని రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇప్పటికే Google ఆ విషయంలో తొందరపడుతూ ఉండగా.. ఇప్పుడు టెస్లా అధినేత ChatGPT ప్రత్యర్థిని అభివృద్ధి చేయడానికి ఒక బృందాన్ని నియమించుకున్నారు. ChatGPTకి ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త పరిశోధనా ప్రయోగశాలను ఏర్పాటు చేయడం గురించి మస్క్ పలువురు పరిశోధకులను సంప్రదించారు. మస్క్ OpenAIకి కొత్తేమీ కాదు. అతను 2015లో సామ్ ఆల్ట్‌మన్‌తో కలిసి ఓపెన్‌ఏఐని ఒక లాభాపేక్షలేని సంస్థగా స్థాపించాడు. అయినప్పటికీ, మస్క్ కొన్ని కారణాల వలన 2018లో బోర్డు నుండి నిష్క్రమించాడు.

ఇక ఎలాన్‌ మస్క్ ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో తిరిగి తొలిస్థానానికి చేరుకున్నారు. భారీ నష్టాల కారణంగా ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన ఆయన టెస్లా షేర్లు రాణించడంతో తిరిగి ఫస్ట్ ప్లేస్ కు వచ్చారని ‘బ్లూమ్‌బర్గ్‌’ సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. ప్రస్తుతం టెస్లా షేర్లు బలంగా పుంజుకోవడంతో రెండు నెలల్లోనే మళ్లీ తన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. టెస్లా షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 70 శాతం మేర పెరిగాయి. ఫలితంగా ఏడాది మొదట్లో 137 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ సంపద ఇప్పుడు ఏకంగా 187 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్‌ తర్వాత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 185 బిలియన్‌ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. అమెజాన్ బాస్ జెఫ్ బెజోసో మూడో స్థానంలో, ఒరాకిల్‌ కో-ఫౌండర్‌ లారి ఎల్లిసన్‌ నాలుగో స్థానంలో, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇండియా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ 84.3 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో ఉన్నారు.


Next Story