నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 12 మంది దుర్మ‌ర‌ణం

Twelve people killed in jeep accident in Nepal.నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2022 9:44 AM IST
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 12 మంది దుర్మ‌ర‌ణం

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఛెడ్గగ‌ఢ్‌ మున్సిపాలిటీలోని లెవే ప్రాంతంలో బొలేరో వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో అందులో ప్ర‌యాణిస్తున్న 12 మంది దుర్మ‌ర‌ణం చెందారు. స‌మాచారం అందుకున్న వెంట‌ట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను ఖాట్మండు, ఛెడగడ్ మున్సి పాలిటీకి చెందిన వారిగా గుర్తించారు. అయితే.. ఈ ప్ర‌మాదానికి ఖ‌చ్చిత‌మైన కార‌ణం ఇంకా తెలియ‌రాలేదు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story